హైదరాబాద్ : ఏపీలోని కడప జిల్లాలో అక్రమంగా నాటుసారాను తరలిస్తున్న ముగ్గురిని ముద్దనూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 420 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, సుమో వాహనాన్ని సీజ్ చేశారు. శనివారం ముద్దనూరులోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రొద్దుటూరు ఇన్ చార్జి సూపరింటెండెంట్ రవి వివరాలను తెలిపారు.
కడప జిల్లా కొండాపురం మండలం దొబ్బుడుపల్లి గ్రామం దారిలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ముద్దనూరు సిఐ చెన్నారెడ్డి, స్క్వాడ్ సిఐ నాగేంద్రమ్మ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. అయితే ఆ సమయంలో అటుగా వస్తున్న టాటా సుమో వాహనాన్ని తనిఖీ చేయగా సారా క్యాన్లను గుర్తించారు. కొండాపురం మండలం చామలూరు గ్రామానికి చెందిన కులశేఖర్ రెడ్డి, రామలింగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి లు కలిసి కర్నూలు జిల్లాలోని ఉమ్మాయపల్లిలో తయారు చేస్తున్న సారాయిని కొనుగోలు చేసి అక్రమంగా కారులో తరలిస్తున్నారని గుర్తించారు. సారాయిని రూ.200 కొనుగోలు చేసి ఇక్కడ రూ.400 కు విక్రయిస్తున్నారని తేలింది. మొత్తం 420 లీటర్ల సారాను గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి సారాయి క్యాన్లను, సుమోను అదుపులోకి తీసుకున్నట్టు సూపరింటెండెంట్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Dec,2021 02:58PM