హైదరాబాద్ : ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 32,036 శాంపిల్స్ పరీక్షించగా, 186 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, చిత్తూరు జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో 191 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,448కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,576 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,979 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,149 మంది చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm