సంగారెడ్డి: పండుగ వేళ జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్‌పల్లిలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు గొడ్డలిలో నరికి చంపాడు. మద్యానికి, జల్సాలకు బానిసైన కొడుకు కిష్టయ్య(42)... డబ్బుల కోసం తండ్రి చాకలి లక్ష్మయ్య(60) కిరాతకంగా హత్య చేశాడు. గతంలో చాకలి కిష్టయ్యకు మూడు వివాహాలు అయినప్పటికీ అతని వేధింపులు తట్టుకోలేక ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm