హైదరాబాద్: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితుల తాకిడి మొదలైంది. గాంధీలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది కరోనా బాధితులు చేరారు. ఇప్పటి వరకు 70, 80 మందితో ఉన్న ఇన్‌పేషెంట్ వార్డు.. ఇప్పుడు 111 మంది ఉన్నారు. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
గాంధీలో చేరిన వారిలో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 02:23PM