హైదరాబాద్: ఓ కారు రోడ్డు డివైడర్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు తెలిపారు.మృతులు మల్లంగౌడ్ (22), సంతోష్ (21), సంజీవ్ (20), జైభీమ్ (18), రఘు (23), సిద్దేష్ (20), వేదమూర్తి (18)లగా అధికారులు గుర్తించారు. వీరంతా సంక్రాంతి వేడుకలు హంపీలో జరుపుకోవడానికి కారులో ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 03:06PM