- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత రిత్యా బీడీఎస్ విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నాగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న రీత్యా తెలంగాణ ప్రభుత్వం ముందు నుండి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అభినందనీయం ఈ కరోనా భారీన విద్యార్థులు పడకూడదని విద్యాసంస్థలకు ముందే సెలవులు కుడా మీరే ఇచ్చారు.కానీ కాళోజీ నారయణరావు హెల్త్ యూనివర్శీటీ పరిధిలోని డెంటల్ విద్యార్ధులకు ఈ నెల (జనవరి 19 )నుండి పరీక్షలు షెడ్యుల్ ఇచ్చారు.ఇప్పటికే చాలామంది విద్యార్థులు కరోనా భారీన పడ్డారు.ప్రోఫెసర్స్ కూడా కరోనా భారీన పడ్డారు. కరోనా కారణమే కాదు ఆన్ లైన్ తరగతులు కూడా సరిగ్గా జరగలేదు. వారు హజరు కావాలసిన పోస్టింగ్ కూడా సరిగా హజరు కాలేదు. ఫైనలియర్ విధ్యార్దులు కరోనా కారణంగా ఏవరైనా హజరు కాకుంటే మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు కాబ్బటి 6 నెలలు ఖాళీగా ఉంటారు. ఎం.డి .ఎస్. (పిజీ)రాయడానికి అవకాశం ఉండదు. విద్యార్థులు సరిగ్గా ప్రిపేర్ కాలేదు. కావున తెలంగాణ రాష్ట్రంలో బిడిఎస్ పరీక్షలు వెంటనే వాయిదా వేసేలాగా యూనివర్శిటీ అధికారులను ఆదేశించవలసినదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి మహేష్, నగర అధ్యక్షులు వేణుగోపాల్, సహాయ కార్యదర్శి అషిఫ్, నాయకులు గణేష్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 04:31PM