- తుమ్మల వెంకటరెడ్డి సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట.
పసర టు మేడారం రహదారిలో ఆర్చి సమీపంలో మట్టి కుప్పలు తొలగించి రహదారిని బాగు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. శుక్రవారం దారి వెంట ఉన్న మట్టి కంకర కుప్పలను సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి సీపీఐ(ఎం) షాపింగ్ కాంప్లెక్స్ ముందు నీరు నిల్వ ఉండటంతో గుత్తేదారు అడగగా వెంటనే జెసిబితో సైడ్ కాలువ తవ్వించి నీటిని శుభ్రం చేయడం జరిగింది. సైడ్ కాలువ తవ్వుతున్న క్రమంలో మట్టిని బీటీ రాళ్లను కుప్పలుగా పోయడం వల్ల మేడారం వెళుతూ వస్తున్న వాహనాలు తరచు ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే గుత్తేదారు జోక్యం చేసుకుని రహదారిని బాగు చేయాలని ఆయన అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు చిట్టిబాబు, పోషాలు, రాజేష్, కుమార్, గ్రామ ప్రజలు షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 05:30PM