హైదరాబాద్: హైవోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందారు. టెంట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్లోని సుపౌల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సశస్త్ర సీమాబల్ 45బీ బెటాలియన్కు చెందిన జవాన్లు.. టెంట్లు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్ఎన్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. నలుగురు జవాన్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు. వీరిని దర్భంగా మెడికల్ కళాశాలకు తరలించారు.
విర్పుర్ ప్రధాన కేంద్రంగా 45బీ బెటాలియన్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. జవాన్లకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 06:18PM