న్యూఢిల్లీ: భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వాయుసేన ఏర్పాటు చేసిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. అందులో సీడీఎస్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి కారణాలను స్పష్టం చేసింది. ఈ ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, కుట్ర, నిర్లక్ష్యం కాదని దర్యాప్తులో స్పష్టమైంది. 2021 డిసెంబర్ 8న జరిగిన ఫ్లైట్ డేటా రికార్డర్ను విశ్లేషించి
వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశించిందని ఆ కమిటీ తన నివేదికలో వివరించింది. ఫలితంగా కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వాయుసేన స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 08:02PM