హైదరాబాద్: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబరు 14న జరిగిన రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు ఈ ఎన్నిక జరిగింది. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా జీవీఎల్‌కు తెలియజేసింది. పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4)(బి)తో పాటు పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం… పొగాకు బోర్డు సభ్యునిగా ఒక రాజ్యసభ సభ్యుడిని హౌస్ సభ్యుల ద్వారా ఎన్నుకుంటారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యులైన బండి సంజయ్ (తెలంగాణ), బాలశౌరి (ఆంధ్రప్రదేశ్) పొగాకు బోర్డు సభ్యులుగా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm