హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. కాకినాడటౌన్-సికింద్రాబాద్ (నంబర్ 82727) సువిధ స్పెషల్ ఈనెల 16న, కాకినాడటౌన్-సికింద్రాబాద్(07537) 18న, నర్సాపూర్-వికారాబాద్ (07496) వన్ వే 16, 18 తేదీల్లో, మచిలీపట్నం-సికింద్రాబాద్ (07298) 17, 19 తేదీల్లో, నర్సాపూర్-వికారాబాద్ (07089 నంబర్ జన్‌సాధారణ్ స్పెషల్) 17న, అనకాపల్లి-సికింద్రాబాద్ (07436 నంబర్ జన్‌సాధారణ్ స్పెషల్) 16న, తిరుపతి-సికింద్రాబాద్(07437 జన్‌సాధారణ్ స్పెషల్)17న, కాకినాడటౌన్-సికింద్రాబాద్(నంబర్ 07539) 17న నడుస్తాయని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm