హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు నేడు యథావిధిగా కొనసాగనున్నాయి. నిజానికి ఈ రోజు సంక్రాంతి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సెలవును ఒక రోజు ముందుకు జరిపింది. ఈ నెల 13న భోగి, 14న సంక్రాంతి అని ప్రభుత్వం ఇటీవల ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు నిన్న మూతపడ్డాయి. ఫలితంగా నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు నేడు యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని బ్యాంకు అధికారులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm