హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఒడిశా వరకు ఉపితల ఆవర్తనం వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికీ నిన్న ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. వడగండ్ల వర్షాలతో పూర్తిగా మిర్చిపంట దెబ్బతింది. ఇప్పటికే నకిలీ విత్తనాలతో పంటను నష్టపోయామని, ఇప్పుడు కాస్తోకుస్తో వచ్చే పంట కూడా వర్షం కారణంగా చేతికి రాకుండా పోయిందని మిర్చి రైతులు వాపోతున్నారు. ములుగు జిల్లాలో వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm