హైదరాబాద్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న 2,68,833 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో 6,041 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 1,22,684 మంది, ఇప్పటివరకు మొత్తం 3,49,47,390 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనాకు 14,17,820 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 156.02 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు మొత్తం 70.07 కోట్ల కరోనా టెస్టులు చేశారు. నిన్న 16,13,740 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2022 10:46AM