హైదరాబాద్ : రవాణా శాఖ వారు సంక్రాంతి పండుగ వేళ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పండుగ వచ్చిదంటే ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ ధరలకు రెక్కలు వస్తాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ మూడో రోజు నిర్వహించారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రత్యేక దాడులు చేశారు. దీంతో ప్రయాణీకులతో పాటు నిబంధనలను అతిక్రమించి కమర్షియల్ గూడ్స్ తరలిస్తున్న 6 బస్సుల పై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ట్యాక్స్ కట్టకుండా చలామణి అవుతున్న ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm