Industry & Commerce Minister of Telangana responds to Elon Musk's tweet, inviting him to set shop in India/Telangana
— Economic Times (@EconomicTimes) January 15, 2022
Track latest news updates here https://t.co/OyEMGUfmSB pic.twitter.com/HlW11uhycj
హైదరాబాద్: భారత విపణిలోకి టెస్లా విద్యుత్ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని మస్క్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.