హైదరాబాద్: కరోనా కేసులు రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న విద్యార్థలను మాత్రమే పాఠశాలల్లోకి అనుమతించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అనిల్ విజ్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు పున:ప్రారంభమయ్యేనాటికి విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అయి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రతి జిల్లాకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించనున్నట్టు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm