హైదరాబాద్: అమెరికాకు చికిత్స కోసం వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కొంతకాలం అక్కడి నుంచే పాలన సాగిస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగా పాలనాబాధ్యతలను వేరే వ్యక్తికి అప్పగించబోనని చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని విజయన్ వెల్లడించారు. వైద్య చికిత్స కోసం ఆయన భార్య, వ్యక్తిగత సిబ్బందితో కలిసి అమెరికా వెళ్లారు విజయన్. జనవరి 29న తిరిగి ఆయన కేరళ వస్తారు. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికీ వర్చువల్ పద్ధతిలోనే విజయన్ హాజరయ్యారు. జనవరి 19న మరో క్యాబినెట్ భేటీకి కూడా ఆయన వర్చువల్ గానే పాల్గొంటారని తెలుస్తుంది. అమెరికా నుంచి సీఎం పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయి. రహస్య పత్రాలను చూసేందుకు రాష్ట్ర సెక్రెటేరియట్ పటిష్ఠ సాంకేతికతను వినియోగిస్తోంది. సరైన ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యి.. ఫైల్స్ వీక్షించే సదుపాయం కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm