హైదరాబాద్: నగరంలో రాత్రి పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పాతబస్తీలోని మీరాలంమండి కూరగాయల మార్కెట్ నీట మునిగింది. తార్నాకలోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు ప్రవహించింది. ఉప్పల్ నుంచి మౌలాలి వరకూ ఎడతెరపి లేకుండాల వర్ష కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రహదారి జలమయం అయ్యింది. వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వర్షం కారణంగా రోడ్లపై తలెత్తిన సమస్యలను తొలగించడానికి... జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి 12 గంటల వరకు నాచారంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఉప్పల్‌లో 9, కాప్రాలో 8.4, సరూర్‌నగర్ 7.7, సైదాబాద్ 5.6, మల్లాపూర్ 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm