హైదరాబాద్: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 1878 నాటి బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం నిర్మించిన క్లబ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పది అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్లబ్లో.. 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. క్లబ్లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించిన భారత ప్రభుత్వం ఈ క్లబ్ పై 2017లో పోస్టల్ కవర్ విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 08:49AM