హైదరాబాద్: విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఈనెల 30 వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించింది. విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm