హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి మృతదేహం కలకలం రేపుతోంది. చింతల్‌మెట్‌లోని ఓ అపార్టుమెంట్ రూమ్ నంబర్ 201లో ఓ యువతి మరణం వెలుగు చూసింది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసుల ఘనటనా స్థలాన్ని పరిశీలించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వారం క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మృతురాలు సమీరా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెది హత్య? ఆత్మహత్య? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 12:08PM