Under Virats leadership Indian cricket has made rapid strides in all formats of the game ..his decision is a personal one and bcci respects it immensely ..he will be an important member to take this team to newer heights in the future.A great player.well done ..@BCCI @imVkohli
— Sourav Ganguly (@SGanguly99) January 15, 2022
హైదరాబాద్: వన్డే కెప్టెన్గానూ తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షులు గంగూలీ ట్వీట్టర్ లో స్పందించారు. "విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణించింది. సారథిగా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. భవిష్యత్తులో ఓ ఆటగాడిగా కోహ్లీ.. జట్టు కోసం మరెన్నో ఘనతలు సాధించాలి. అతడో గొప్ప ప్లేయర్." అంటూ ట్వీట్ చేశారు. టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీ టీమ్ఇండియా టీ20 సారథిగా తప్పుకొన్నాడు. అనంతరం.. అతడిని వన్డే కెప్టెన్గానూ తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు కూడా కోహ్లీ గుడ్బై చెప్పడం అభిమానులకు నిరాశకు గురిచేసింది.