చెన్నె: తమిళనాడులోని వెల్లూరులో జరిగిన జల్లికట్టులో అపశ్రుతి జరిగింది. ఎద్దు వెంట పరుగెడుతున్న యువకుడికి ప్రమాదవశాత్తు.. దాని తాడు మెడకు బిగుసుకుంది. ఈ క్రమంలో మెడకు తాడు బిగుసుకున్న యువకున్ని ఎద్దు అలాగే కొద్ది దూరం పాటు లాక్కెళ్లింది. గ్రామస్థులు ఎద్దును నివారించి.. అతడి మెడకు ఉన్న తాడును విప్పారు. దీంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన.. ఆ యువకుడికి సరైన సమయంలో ప్రథమ చికిత్స అందించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.
Mon Jan 19, 2015 06:51 pm