హైదరాబాద్: హైదర్‌గుడాలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తులోని అపార్ట్మెంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భవనానికి అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థ సక్రమంగా లేదని.. స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm