Door to door campaign in Goa today. https://t.co/Yi9C1vYITK
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 15, 2022
గోవా: గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడి ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ 13 పాయింట్ల అజెండాను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యా, వైద్యం, వ్యాపారం, జీవనోపాధి, మైనింగ్, మౌలిక వసతులు సహా పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి కుటుంబం రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని మాటిచ్చారు.