లక్నో: యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న దారా సింగ్ చౌహాన్ ఆదివారం నాడు లాంఛనంగా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గత శుక్రవారం నాడు బీజేపీ నుంచి బయటకు వచ్చి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
కాగా, అఖిలేష్ యాదవ్‌ను యూపీ తదుపరి ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకు రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని దారాసింగ్ తెలిపారు. 2017లో వెనుకబడిన వర్గాల ఓట్లతో గెలిచిన బీజేపీ ఆ తర్వాత వారికి చేసిందేమీ లేదని తప్పుపట్టారు. ఆ కారణంగానే బీసీలంతా సమాజ్‌వాదీ పార్టీకి తరలివస్తున్నారని చెప్పారు. బీజేపీని ఓడించి, గద్దె దింపేందుకు ఎస్‌పీలో చేరిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని దారాసింగ్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 04:36PM