హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎంపీ డి శ్రీనివాస్ సొంత గూటికి చేరబోతున్నారు. అందుకు ఆయన ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డీఎస్ కాంగ్రెస్ ను వీడి అధికార టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుంచి ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. అయినా కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది.
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రానికి మాజీ పీసీసీ డీఎస్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూవచ్చారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్ డీఎస్ ఇంటికి వెళ్లి డీఎస్‌ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం వెంటవెంటనే జరిగిపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 05:00PM