హైదరాబాద్: విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి అనూహ్యంగా గుడ్‌బై చెప్పడంపై టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘షాక్డ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్పందనను తెలియజేశాడు. కోహ్లీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. విజయవంతమైన ఇండియన్ కెప్టెన్ అని రోహిత్ ప్రశంసించాడు. అతడి భవిష్యత్ మరింత బాగుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. కాగా, గాయం కారణంగా రోహిత్ దక్షిణాప్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ వన్డే జట్టుకు కూడా దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm