హైదరాబాద్: లంగర్హౌస్లో ఓ యువకునిపై యువతి కత్తితో దాడి చేసింది. గత కొంత కాలంగా కృష్ణ అనే యువకుడు ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. వాళ్లిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి ఒక్కసారిగా కృష్ణపై కత్తితో దాడికి దిగింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm