హైదరాబాద్: అప్పటి వరకు విధుల్లో ఉన్న కండక్టర్కు కరోనా నిర్ధరణ కాగా.. హన్మకొండ నుంచి చెన్నూరుకు వచ్చిన ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది యాదృచ్ఛికంగా చేసిన పరీక్షలో డ్యూటీలో ఉన్న ఓ మహిళా కండక్టర్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది. విధుల్లో భాగంగా అప్పటి వరకు ఆ కండక్టర్ చాలా మంది ప్రయాణికుల మధ్యలో ఉండటం.. టికెట్లు ఇవ్వటం.. డ్రైవర్తో కలిసి టీ తాగటం.. వల్ల వాళ్లందరికీ కరోనా సోకే అవకాశం లేకపోలేదు. దీంతో.. అధికారులు ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్లందరు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm