కేరళ: ప్రముఖ గీత రచయిత, డైరెక్టర్ అల్లెప్పీ రంగనాథ్(73) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా రంగనాథ్ కరోనాతో బాధపడుతున్నారు. దీంతో కొట్టాయంలో మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. 19 ఏండ్ల వయసులో కంజీరాపల్లి పీపుల్స్ ఆర్ట్ క్లబ్ కోసం పాట రాసి, సంగీతమందించారు. రంగనాథ్ ఆ తర్వాత 1973లో 'జీసెస్' సినిమాకు పాటలు రాశారు. బైబిల్ ఆధారంగా 10 కీర్తనలు కూడా రచించారు. అయ్యప్ప స్వామి మీద రాసిన పాటలకుగానూ రంగనాథ్ను ఈ ఏడాది కేరళ ప్రభుత్వం హరివరాసనం అవార్డుతో సత్కరించింది. ఆయన కెరీర్లో మొత్తంగా 42 నాటకాలకు, 25 డ్యాన్స్ డ్రామాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణం పట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm