హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూతపడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అగ్ని ప్రమాదంతో చాలా వరకూ నష్టపోయామని యాజమాన్యం చెబుతోంది. క్లబ్ సభ్యులకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉందని తెలిపింది. క్లబ్‌లోని కొల్నాడబార్, బిలియర్డ్స్ రూం, బాల్‌రూం, మెయిన్ రిసెప్షన్ నుంచి ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లే చెక్కమెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మెయిన్ హాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైందన్నారు. క్లబ్‌కు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాన్యం వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm