హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందనే కారణంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేఖిస్తుంది.ఇచ్చిన జీ.వో.నెంబర్ :04 వెంటనే రద్దు చేయాలని ఎస్.ఎఫ్.ఐ కోరతుంది. రాష్ట్రంలో కరోనా పేరుతో విద్యాసంస్థలకు సెలవులకు ఇవ్వడం అంటే విద్యార్ధుల భవిష్యత్ నాశం చేయడం అని ఎస్.ఎఫ్.ఐ. భావిస్తుంది. ప్రపంచ దేశాలలో ఎక్కువ కేసులు వస్తున్న దేశాల్లో కూడా విద్యాసంస్థలు మూసివేయలేదని ,ప్రక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యాసంస్థలు నడుస్తున్నాయని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఇప్పటికే 21 నెలలుగా విద్యార్థులు తమ చదువులు పూర్తిగా నష్టపోయారు.ఇప్పుడు ఆన్ లైన్ చదువులు అంటే సామాజికంగా,ఆర్ధికంగా నష్టపోయ్యే అవకాశం ఉంది. లాఫ్ ట్యాఫ్స్ , ట్యాబ్ లు కోనలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు మొబైల్ ఇంటర్నెట్ టారీఫ్ పెంచాయి.ఇంటర్నెట్ వైఫై ఛార్జీలు కూడా పెరిగాయి. ఇప్పటికే ఆన్ లైన్ చదువుల ఫలితాలు ఎలా ఉంటాయే చూశాం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలే నిదర్శనం 51% మంది ఫెయిలైయారు. ఆన్ లైన్ చదువులు ఎలాంటి పరిస్థితి లో నైనా నష్టదాయకం.ప్రజా రవాణా వ్యవస్థ, మాల్స్,థియేటర్లు, రెస్టారెంట్లు,రాజకీయ పార్టీల ర్యాలీలు, పండుగలకు లేని ఆంక్షలు విద్యార్దులకు పెట్టడం అంటే ఒక తరం నష్టపోవడం జరుగుతుంది. ఒక వేళ కరోనా తీవ్రంగా ఉంటే ప్రైమరి పాఠశాలలు సెలవులు ఇచ్చి మిగతా సంస్థలు కనీసం షిప్ట్ పద్దతిలోనైనా నడపాలి. ఇప్పటికే 74% మంది విద్యార్థులు డఫ్రౌవుట్స్ పెరిగాయి. వారి సామర్థ్యం దెబ్బతింటుంది. అందుకోసం ఈ డిమాండ్లను ప్రభుత్వానికి సూచిస్తుంది.
1.ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
2.ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న విద్యాసంస్థలలో షిప్ట్ పద్దతిలో ఉదయం, సాయంత్రం
తరగతులు నిర్వహించాలి.
3.ప్రతి హైస్కూలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో శానిటేషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి.
4.ఆన్ లైన్ చదువులు పెట్టాలంటే ప్రభుత్వం ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేయాలి.
5. ప్రభుత్వమే ఉచితంగా ఇంటర్నట్ కల్గిన సిమ్, ట్యాబ్ ,అందించాలి.
ఈ డిమాండ్లతోపాటు, విద్యాసంస్థలు ప్రారంభించాలని ఎస్.ఎఫ్.ఐ. దశల వారీగా ఆందోళనలు చేపడుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 03:36PM