అమరావతి : ఏపీలోని కడప రిమ్స్‌లో కరోనా కలకలం సృష్టించింది. కళాశాలలోని 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ యింది. ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనుండగా.. 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో ఇప్పుడు 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడగా.. మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm