నిజామాబాద్ : తీసుకున్న డబ్బు ఇవ్వాలని ఓ యువకుడిని యజమాని కొట్టడంతో ఆ యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ లో నర్మదా వాటర్ ప్లాంట్ లో యువకుడు పనిచేసేవాడు. ఈ క్రమంలో వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అనంతరం యువకుడు అక్కడ ఇష్టంలేక పని మానేశాడు . అయితే తీసుకున్న పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ యజమాని యువకుడిని చితకబాదినట్టు తెలిసింది. దాంతో యువకుడు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చాడు. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm