హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటపల్లి మండలం ఆలుగాంలో ప్రాణ హిత నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంశీ వర్ధన్, విజయేంద్ర సాయి, రాకేష్ అనే ముగ్గురు విద్యార్థుల ఈత కోసం నదిలోకి దిగి గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm