హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. డిండి దగ్గర క్వాలిస్ వాహనం టైర్ పంక్చరై బోల్తా పడింది. దాంతో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో చిన్నారి ఇజాన్ కు తీవగ్రాయాలు కాగా ఆ చిన్నారిని హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట బాబానగర్ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm