హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లోకేశ్ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు త్వరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm