అమరావతి : సినీ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ పొదిల రత్తయ్య (84) ఆదివారం మృతి చెందారు. వయో భారంతో ఆయన తన స్వగ్రామం ఫణిదంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన రత్తయ్య గతంలో కృష్ణంరాజుతో భగవాన్ సినిమాను నిర్మించారు. ఫిలి డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించి పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు రూ.5 కోట్ల విరాళం అందించారు. ఆయనకు భార్య హైమవతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ పొదిలి ప్రసాద్ అమెరికాలో వైద్యునిగా స్థిరపడ్డారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm