ముంబై : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. అదేంటీ అనుకుంటున్నారా.. అయితే ఈ సారి విడుదలయ్యేది తెలుగులో కాదు హిందీలో. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా హిందీలో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమాను హిందీలో ఈ నెల 26న ధియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్నిసినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో.. తెలుగులో 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:47PM