అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 22,882 శాంపిల్స్ పరీక్షంచగా.. 4,108 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. విశాఖపట్నంలో 1,018, చిత్తూరు జిల్లాలో 1,004, గుంటూరులో 345, కడపలో 925, తూర్పు గోదావరిలో 263గా నమోదయ్యాయి. ఎలాంటి మరణాలు సంభవించలేదు. కాగా మరో 696 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,18,84,914 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కు చేరింది. 20,65,696 మంది కోలుకోగా 14,510 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,182గా ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm