న్యూఢిల్లీ : దేశంలో 12 నుంచి 14 ఏండ్ల చిన్నారులకు మార్చి నుండి వ్యాక్సిన్‌లు వేయనున్నట్టు తెలుస్తోంది.. వారికి మార్చి నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చని నేషనల్ టెక్నికల్ ఆడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ)కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోడా సోమవారం తెలిపారు. గతేడాది జనవరి 17 నుండి దేశంలో కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 3నుండి 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి నాటికి 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు బాలబాలికలు మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్‌లో తెలిపారు. దేశంలో 7.40 కోట్ల మంది 15-18 ఏండ్ల వయసు పిల్లలు ఉన్నట్లు అంచనా.
Mon Jan 19, 2015 06:51 pm