- బీఎస్పీ కరీంనగర్ జిల్లాద్యక్షుడు నిషాని రామచంద్రం ఆరోపణ
- ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రజలు బహిష్కరించాలని పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
పాత్రికేయులపై దాడి జరిగిందంటే.. ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్టేనని బీఎస్పీ కరీంనగర్ జిల్లాధ్యక్షుడు నిషాని రామచంద్రం ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ అవరణం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిషాని రామచంద్రం మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండల పాత్రికేయునిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన అనుచరులతో దాడి చెయించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిఖచ్చితంగా వార్తలు వ్రాసే పాత్రికేయులను బెదింపులకు పాల్పడుతూ దాడి చేసే వారిని.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇకనైనా మేల్కొని రానున్న ఎన్నికల్లో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. బీఎస్పీ నాయకులు సంగుపట్ల మల్లేశం,నిషాని రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 07:51PM