హైదరాబాద్ : దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం బద్ధలైంది. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి.టోంగా రాజధాని నుకోలోపాలోకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఈ బూడిద 19 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించినట్టు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ అగ్నిపర్వతం పేలుడు 2,383 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ వరకు వినిపించింది. ఇది 5.8 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. సునామీ కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఇంటర్నెట్, ఫోన్లు కూడా పనిచేయడం లేదు.
టోంగాలో పరిస్థితిని తెలుసుకునేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం.. ఒక ప్రత్యేక విమానాన్ని పంపించింది. ఈ సునామీ కారణంగా భారీ నష్టం సంభవించిందని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ తెలిపారు. దీవిలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని.. ఫోన్లు పనిచేయడం మొదలవుతుందని ఆమె తెలిపారు. కాగా, అగ్నిపర్వతం విస్ఫోటం నేపథ్యంలో అమెరికా, న్యూజిలాండ్, జపాన్ సహా పలు దక్షిణ పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 08:41PM