హైదరాబాద్ : తెలంగాణలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇందిరారెడ్డి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm