హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసుకు సంబంధించిన ఒరిజినల్ కేస్ డైరీ పార్టు-2ను వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసిన కార్పొరేటర్‌పై కోర్టు అనుమతితో నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నంబర్ 516/2021 కేసుకు సంబంధించిన ఒరిజినల్ కేస్ డైరీ పార్టు-2 వివరాలను జీహెచ్ఎంసీ 40వ డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కులేట్ చేశారు. గుర్తించిన వినాయకనగర్‌కు చెందిన మణిరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm