హైదరాబాద్: తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ విడివిడిగా తమ ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు. తమ 18 ఏండ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇద్దరూ అందులో తెలిపారు.
"18 ఏండ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్ ట్విటర్‌లో ఉంచిన లేఖలో పేర్కొన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 11:44AM