ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరగడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీగా నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఐటీ, మెటల్, ఫార్మా రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగడం కూడా కారణం అని చెప్పొచ్చంటున్నారు నిపుణులు. సెన్సెక్స్ 554.05 పాయింట్లు (0.90 శాతం) క్షీణించి 60,754.86 వద్ద ముగిస్తే, నిఫ్టీ 195.10 పాయింట్లు(1.07 శాతం) నష్టపోయి 18,113 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.58 వద్ద ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm