ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు ఆడబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఈ నెల 20 నుంచి ఓమన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనబోయే జట్ల కెప్టెన్ల పేర్లను ప్రకటించారు. అయితే భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించే మహారాజ టీమ్కు కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్గా మహ్మద్ కైఫ్ నియమితుడయ్యాడు. కోచ్గా ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ జాన్ బుచనన్ వ్యవహరించనున్నాడు.
ఇక ఆసియా లయన్స్కు సారథిగా మిషబ్ ఉల్ హక్, వైస్ కెప్టెన్గా తిలకరత్నె దిల్షాన్, కోచ్గా అర్జున, వరల్డ్ జెయింట్స్కు సారథిగా డారెన్ సామీ, మెంటార్గా జాంటీ రోడ్స్ వ్యవహరించనున్నారు.
భారత మహారాఇండియా మహారాజాస్: వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావ్, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారీ
ఆసియా జట్టు: షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, కమ్రాన్ అక్మల్, చమిందా వాస్, రొమేష్ కలువితారణ, తిలకరత్నే దిల్షాన్, అజర్ మహమూద్, ఉపుల్ తరంగ, మిస్బా-ఉల్-హక్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ యూసుఫ్, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, అస్గర్ ఆఫ్ఘన్
వరల్డ్ జెయింట్స్: డారెన్ సామీ, డేనియల్ వెట్టోరి, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్, కెవిన్ పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్, ఒవైస్ షా, హెర్షెల్ గిబ్స్, ఆల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్, కోరీ ఆండర్సన్, మాంటీ పనేసర్, బ్రాడ్ హాడిన్, కెవిన్ ఓబ్రీన్
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 09:32PM